- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
దిశ, పాలకుర్తి (దేవరుప్పుల) : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అధైర్య పడవద్దు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలోని వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి పరిశీలించి రైతులతో మాట్లాడారు. కొనుగోలు ప్రక్రియ సరిగా జరుగుతుందా ఏమైనా సమస్యలు ఉన్నాయని రైతులతో ఆరా తీశారు. అధికారులను పిలిచి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. తరుగు విషయంలో తేడాలు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. రైతులు పంటల విషయంలో అకాల వర్షాల కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అలాంటి పరిస్థితులలో కూడా రైతులను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్ అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి తెలిపారు.
పంటల నష్టపరిహారం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇవ్వడంతో పాటు గిట్టుబాటు ధర కల్పించి తడిసిన ధాన్యాన్ని సైతం మద్దతు దరకే కొనుగోలు చేస్తారని తెలిపారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసే రైతులకు అండగా నిలవాలన్నారు. ఆఖరు గింజ వరకు ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని రైతులు ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులకు సహకరించాలని సూచించారు. జడ్పీటీసీ పళ్ళ భార్గవి సుందర్ రామిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ బస్వ సావిత్రి మల్లేష్, పీఎసీఎస్ చైర్మన్ లింగాల రమేష్ రెడ్డి, వైస్ ఎంపీపీ కత్తుల విజయ్ కుమార్, యువనాయకుడు బబ్బురి శ్రీకాంత్ గౌడ్, సర్పంచ్ గోపాల దాస్ మల్లేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు మేకపోతుల నరసింహ, స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.