- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Farmers' agitation : ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన…పోలీసుల రంగ ప్రవేశం
దిశ నల్లబెల్లి : నకిలీ పురుగు మందులతో పంట నష్టపోయినట్లు రైతులు ఆరోపిస్తూ షాప్ ముందు ఆందోళనకు దిగిన సంఘటన సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ముద్గం యుగంధర్ రెండు ఎకరాల మిరప తోట సాగు చేశాడు. తోటకు సంబంధించిన పురుగు మందులను నల్లబెల్లి మండల కేంద్రంలోని ఖాజామైనుద్దీన్ ఫెర్టిలైజర్ షాపులో కొనుగోలు చేసి తోటకు పిచికారి చేశారు. పిచికారి చేసిన అనంతరం వారం రోజుల లోపు రెండు ఎకరాల తోట మొత్తం ఎండు దశకు రావడంతో రైతు ఆందోళన చెందుతూ… సదరు షాప్ యజమాని సంప్రదించారు. షాప్ యజమాని హైమద్ తోటను పరిశీలించి సంబంధిత కంపెనీ ప్రతినిధులను రప్పించి రైతుకు న్యాయం చేస్తామని తెలిపినట్లు బాధిత రైతు తెలిపారు.
గత 15 రోజుల నుంచి రేపు, మాపు అంటూ దాటవేసి ధోరణి చేస్తుండడంతో సోమవారం షాప్ లో ఉన్న హైమద్ కాళ్లపై పడి న్యాయం చేయాలని వేడుకున్నారు. అయినప్పటికీ షాప్ యజమాని స్పందించకపోవడంతో ఆందోళనకు దిగినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ప్రశాంత్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ఈ కేసు సీఐ దృష్టిలో ఉందని, సీఐ కార్యాలయానికి వెళ్లినట్లయితే తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలపడంతో రైతులు ఆందోళన విరమించి సీఐ కార్యాలయానికి వెళ్లారు. రైతులు సీఐ కార్యాలయానికి వెళ్తున్నారని షాప్ యాజమాని హైమద్ ను సీఐ కార్యాలయానికి వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించినట్లు ఎస్సై తెలిపారు.