- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్హులైన పేదలందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు : ఎమ్మెల్యే రేవూరి
దిశ, సంగెం : సంగెం మండలం కృష్ణా నగర్ గ్రామంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పనకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియను కుటుంబ సభ్యుల వివరాల నమోదును ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్వేలో ప్రతి కుటుంబం సమగ్ర వివరాలకు సంబంధించిన షీట్ ప్రత్యేకంగా ఉండాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను సక్రమంగా, మరింత సమర్థవంతంగా అమలు చేయడానికే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేస్తున్నదని,ఇందుకోసం 3 నుంచి 7వ తేదీ వరకు పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణానగర్ గ్రామాన్ని ఎంపిక చేశామని అన్నారు.
ఎలూగుర్ రంగంపేట చెరువులో ముదిరాజ్ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చేప పిల్లలను చెరువులో వదిలారు. మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుతున్నదని, ముదిరాజ్ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.