- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"బైబై సీతక్క.. వెల్కం జ్యోతక్క"..
దిశ, ములుగు ప్రతినిధి : శనివారం ములుగు టౌన్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీటీసీ అనుమల సురేష్ శిరీష, కాంగ్రెస్ కు చెందిన యువనాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ, సుభిక్ష పాలనకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు బీఆర్ఎస్ లో చేరిన నాయకులు తెలిపారు. పేదింటి బిడ్డ, ప్రజాసేవను వారసత్వంగా అందుకున్న పోరాట యోధుడి కూతురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపే లక్ష్యంగా తామ పని చేస్తామని అన్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సీతక్క నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని సోషల్ మీడియాలో పబ్లిసిటీ తప్ప నియోజకవర్గానికి, నియోజకవర్గంలోని పేదలకు చేసింది ఏం లేదని వారు ఆరోపించారు. అందుకే తమ బీఆర్ఎస్ లోచేరుతున్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు ఇప్పటికే ఖరారు అయిపోయిందని, సీతక్క ఫేక్ సహాయ కార్యక్రమాలు పబ్లిసిటీ స్టంట్లు ప్రజలందరికీ తెలిసిపోయాయని అన్నారు. రీల్ స్టార్ అనే విషయాన్ని ప్రజలు గుర్తించారని అందుకే ఇప్పుడు ములుగు నియోజకవర్గ ప్రజలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కేడర్ కూడా "బై బై సీతక్క... వెల్కమ్ జ్యోతక్క" అంటూ నినదిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ నాయకులు, ఇతర పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్, సీనియర్ నాయకులు కాకి పురుషోత్తం, మెర్గు సంతోష్, గజ్జి నగేష్, అరుణ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.