ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డాక్టర్ మురళి నాయక్

by Sumithra |
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం : డాక్టర్ మురళి నాయక్
X

దిశ, గూడూరు : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మహబూబాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మురళి నాయక్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గూడూరు మండలంలోని లైన్ తండ , కొమ్ముల వంచ, సీతానగరం, భూపతిపేట, చిన్నఎల్లాపూర్, గ్రామాలలో పర్యటించారు. ధరణి పోర్టల్ వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందని, అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని అన్నారు. గూడూరు మండలంలోని భీముని పాదం జలపాతంను అభివృద్ది చేస్తాము అన్నారు. గిరిజన తండాలకు, బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ది బీఆర్ఎస్ అంటే లాక్కోవడం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని 9 ఏండ్లలో పార్టీ ఏం చేసిందని మండిపడ్డారు.

ఎంతమంది నిరుపేదలకు ఇండ్లు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేపట్టిన ఉద్యమ కారులను పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమకారుల జీవన విధానాలను అధోగతిగా మార్చారని అన్నారు. ఇక పై తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదని ప్రజలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. వారితో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు మాధవపెద్ది ప్రదీప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టె వెంకన్న, యాకుబ్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, రమణ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు బొల్లికొండ మధు, జిల్లా కార్యదర్శి కొమ్మాలు, యూత్ ప్రధాన కార్యదర్శి హెచ్చు శివ, వీరస్వామి, ఎడ్ల నరేష్ రెడ్డి, పూజారి శంకర్, మహేందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed