- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాన ఎన్నికల అధికారిని కలిసిన డాక్టర్ కొలిపాక వెంకటస్వామి..
దిశ, హనుమకొండ : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి సంబంధించి, వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కి గాను ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఇతర బోధన ఫ్యాకల్టీలు జిల్లాలలో దాదాపుగా 48,000 మంది ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు చాలా తక్కువ స్థాయిలో నమోదు అయింది. కేవలం 15,121 మంది మాత్రమే వారి ఓటును నమోదు చేసుకున్నారని డాక్టర్ కొలిపాక వెంకట స్వామి ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ సిపిఎస్ అభ్యర్థి ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వ కార్యదర్శి సి.సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ కళాశాలల్లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న లెక్చరర్లు, ప్రొఫెసర్లు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా తమ ఓటును నమోదు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో ఎన్నికల అధికారులు, సిబ్బంది తమ ఓటు వేయడానికి అర్హులైన పైన పేర్కొన్న ఉద్యోగుల సమూహాలలో అర్హత ప్రమాణాలు, ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి అవగాహన శిబిరాలు సమావేశాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ఆర్డర్ జి. ఓ.ఎం.ఎస్.నెం.49 ప్రకారం అర్హులైన వారందరినీ ఎన్రోల్మెంట్ అయ్యేవిధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ -ఖమ్మం -నల్గొండ శాసనమండలి ఓటరు నమోదు చాలా తక్కువ కావడానికి కారణాలు బతుకమ్మ పండుగ, దసరా సెలవులు (15 రోజులు), దీపావళి ఐదు రోజుల పండుగల కారణంగా అక్టోబర్ నెలలో పనిదినాలు తక్కువగా ఉండటం వలన తక్కువ స్థాయిలో ఓటు నమోదుకు మరో కారణం అని ఎలక్షన్ కమిషన్ కు డాక్టర్ కొలిపాక వెంకటస్వామి ఎక్స్ అసోసియేట్ ప్రొఫెసర్, సిపిఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తెలియజేశారు. కావున ఓటర్ల నమోదుకు చివరి తేదీని పొడిగించాలని అర్హులైన ఇంకా నమోదు చేసుకోని వారి తరపున ప్రధాన ఎన్నికల అధికారిని కోరారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తమను తాము ఓటర్లుగా నమోదు చేసుకొనుటకు పైన పేర్కొన్న వర్గాల ఉపాధ్యాయుల నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేయవలసిందిగా విన్నవించారు.