- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదాలొద్దు..రాజయ్యకు Minister KTR సూచన
దిశ, వరంగల్ బ్యూరో : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఆధిపత్య పోరుకు దిగుతూ వ్యక్తిగత దూషణల వరకు వెళ్లిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అధిష్టానం జోక్యంతో శాంతించారు. కొద్దిరోజులుగా ఒకరిపై ఒకరు పరోక్షంగా, ప్రత్యక్షంగా విమర్శలు, ఆరోపణలతో స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాల్లో హీట్ పెంచుతూ వచ్చారు. అయితే ఈ విమర్శలు, ఆరోపణలు కాస్త వ్యక్తిగత అంశాలకు దారితీయడంతో బీఆర్ ఎస్ అధిష్టానం అలర్ట్అయింది. ఈ క్రమంలోనే రాజయ్యకు మంత్రి కేటీఆర్ నుంచి పిలుపు రావడంతో మంగళవారం ఉదయం ఆయన హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్లారు. దాదాపు పది నిముషాల పాటు మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీలో రాజయ్య నియోజకవర్గంలో కడియం గ్రూపు రాజకీయాలను నడుపుతున్నట్లుగా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేయగా, ఏమైనా కానివ్వండి వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఎందుకంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే నియోజకవర్గంలో తనపై బురద జల్లేందుకు ప్రణాళిక ప్రకారం కడియం వర్గీయులు దుష్ర్పచారానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు చేసినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. నవ్య ఎపిసోడ్‌లోనూ కుట్ర జరిగిందని, నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయంటూ తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని కూడా మంత్రికి వివరించినట్లుగా తెలుస్తోంది.
ఏం జరుగుతోందో నాకు అంతా తెలుసు..!
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తనకు చాలా సమాచారమే ఉందని రాజయ్యతో కేటీఆర్ అన్నట్లు సమాచారం. ‘మీరెవ్వరి మీద కామెంట్ చేయకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండి. మీకెలాంటి ఇబ్బంది లేదని, స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్ సహా, ఏం చేయాలన్నది పెద్ద సార్(ముఖ్యమంత్రి కేసీఆర్) చూసుకుంటారని’ పేర్కొన్నట్లు సమాచారం.
పార్టీకి కట్టుబడి ఉండాలని, లైన్ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని ఆదేశించారు. అంతేకాదు ఎన్నికల సమయం దగ్గరపడుతోందని, ఇద్దరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలని కూడా సూచించినట్లు సమాచారం. అధిష్టానం ఏం చెబితే దానికి శిరసా వహిస్తానంటూ రాజయ్య మంత్రి కేటీఆర్‌కు తెలిపినట్లుగా తెలుస్తోంది.
నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుపీరియర్..!
మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీ అనంతరం ఆయన పలు మీడియా చానెళ్లతో మాట్లాడిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చెప్పినా వినడానికి తాను సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పారు. అలాగే మంత్రి కేటీఆర్‌తో జరిగిన భేటీ వివరాలను విస్పష్టంగా వివరించారు. కడియంతో జరుగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లుగా కూడా స్పష్టం చేయడం గమనార్హం. కడియం శ్రీహరి కూడా తనకంటే ముందు కేటీఆర్ ను కలిసినట్లుగా తనకు తెలిసిందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మరింత ఉత్సాహంగా పని చేస్తామన్నారు. అధిష్టానం ఆశీస్సులు తనకు నిండుగా ఉన్నాయన్నారు. కేటీఆర్ నుంచి తనకు పిలుపు రావడంతో ఉదయం వచ్చానని, ఆయనతో మాట్లాడానన్నారు. తన నియోజకవర్గంలో తనపై అసత్య ప్రచారం జరుగుతుండటంతో స్పందించాల్సి వచ్చిందని, ఇదే విషయాన్ని కేటీఆర్ దృష్టకి తీసుకువెళ్లానని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుపీరియర్ అని కేసీఆర్ వివిధ సందర్భాలలో చెప్పారన్నారు. కానీ కడియం గ్రూప్ రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద చెప్పానని, అయితే నియోజకవర్గంలో పని చేసుకుంటూ వెళ్లమని తనకు సూచించారన్నారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నట్లు పార్టీ వద్ద సమాచారం ఉందన్నారు. తనకు టిక్కెట్ వస్తుందని నియోజకవర్గంలో కడియం ప్రచారం చేసుకుంటోన్న విషయాన్నీ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లానని చెప్పారు. అయితే ఎవరు తమకు టిక్కెట్ వస్తుందని చెప్పుకున్నప్పటికీ ఫైనల్ గా ఆ విషయాన్ని కేసీఆర్ నిర్ణయిస్తారని కేటీఆర్ తనకు చెప్పారన్నారు. ఎవరో మాట్లాడిన దానిని బట్టి స్పందించవద్దని, క్షేత్రస్థాయిలో పని చేసుకుంటూ వెళ్లమని తనకు సూచించారన్నారు. సర్పంచ్ నవ్య తనపై చేసిన ఆరోపణలు మహిళా కమిషన్ వద్దకు వెళ్లాయని, కానీ అది తప్పుడు కేసు అని తేలిందన్నారు.