- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య..
దిశ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం తక్కళ్ల పహాడ్ గ్రామంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ,కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే )ను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్ సర్వేలో భాగంగా కుటుంబ వివరాలను అడిగి నమోదు చేస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. సర్వేకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేటర్ కుటుంబ వివరాలు నమోదు చేస్తుండగా కలెక్టర్ అక్కడే ఉండి పరిశీలించారు. సర్వే లో అన్ని వివరాలు నమోదు చేయాలని ఎన్యుమరేటర్ కు కలెక్టర్ సూచించారు. సర్వే సందర్భంగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతు న్నాయా అని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ కె. నారాయణ, దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎన్యుమరేటర్లు, సర్వే సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.