లింగోద్భవ దర్శనం .. భక్తులకు దుర్లభం

by Javid Pasha |
లింగోద్భవ దర్శనం .. భక్తులకు దుర్లభం
X

దిశ, కాటారం : మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భావ కాలంలో శివలింగం పై మారేడు దళం పెట్టి భక్తిలో చాటుకోవాలని ప్రజల కోరిక. జాగరణ చేస్తూ ఆ మహదేవదేవుని దర్శించుకోవాలన్న భక్తుల ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కాలేశ్వరం పుణ్యక్షేత్రంలో లింగోద్భవ దర్శనం ప్రజలకు ముఖ్యులకు ప్రాణ సంకటమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి కొత్త నిబంధన పెడుతూ గర్భాలయలోకి ఎవరిని వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో వీఐపీలు, మండల, కాలేశ్వరం గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, మాజీ పాలకవర్గ చైర్మన్లు, ధర్మకర్తలు, ఆలయానికి వివిధ రూపేనా కొనసాగుతున్న దాతలతో పాటు మహాశివరాత్రి జాతర ముఖ్య అధికారి జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డిలతో సహా పలువురు లింగోద్భవ దర్శనం కోసం ఒక ద్వారం ముందరగల మండపంలోనే నిరీక్షించాల్సి వచ్చింది.

విఐపీ లను లోనికి వెళ్లకుండా ఈవో నిబంధన విధించడం అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిబంధనపై తెలుసుకుందామనుకున్న అధికారులు ప్రజాప్రతినిధులు యాత్రికులకు ఈవో అందుబాటులో లేరు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఆ జాతర సందర్భంగా ఈవో అందుబాటులో ఉండాల్సి ఉండగా లింగోద్భవ కాలంలో గైరహాజరవడం అందరికీ కోపం తెప్పించింది. శనివారం రోజున జాతర జరుగుతున్న సమయంలోను కార్యనిర్వహణాధికారి కార్యాలయానికి పరిమితమయ్యాడని, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు యాత్రికులు ఆరోపించారు. జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి దర్శనం కోసం వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులు పడ్డారు.

దర్శనం కోసం ముఖద్వారం ముందర బాగా దున్నుబడిన యాత్రికులు ఓం నమశ్శివాయ.. ఓం నమః శివాయ.. శివ శివ దర్శనం కోసం ఏమీ టీ పాట్లు అంటూ అరిచారు. దర్శనం కోసం ముఖద్వారం ముందు గుమ్మి కూడిన భక్తులను నియంత్రించి క్యూలైన్ ద్వారా లోపలి పంపేందుకు దేవాదాయ లేదా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తులు విమర్శలు చేశారు. వీఐపీల దర్శనం పూర్తయ్యాక ఆధారణ భక్తులను లోనికి అనుమతించారు. లింగోద్భవ దర్శనం పై జరిగిన అసౌకర్యం, ఆలయ ముఖ్య కార్యనిర్వహణాధికారి అందుబాటులో లేకపోవడంపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి పంపించనున్నట్లు మహాశివరాత్రి జాతర సిఈఓ రఘువరన్ తెలిపారు.

రాత్రంతా భజనలు.. కవితా సమ్మేళనం

మహాశివరాత్రి రోజున కాలేశ్వరం దేవాలయంలో భక్తులు రాత్రంతా జాగరణ చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆదివారం ఉదయం వరకు భజనలు చేశారు. మరోవైపు ఈవో కార్యాలయం ముందు నా వేదికలో జిల్లాలోని కవులు కవి సమ్మేళనం నిర్వహించడంతోపాటు గేయాలు ఆలపించారు. శనివారం రాత్రంతా జాగరణ చేసిన భక్తులు కాలేశ్వరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed