- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ ని నమ్మితే కష్టాలే : హరీష్ రావు
దిశ, నెక్కొండ/నర్సంపేట : కాంగ్రెస్ ని నమ్మితే కష్టాలపాలవుతారని హరీష్ రావు అన్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రోడ్ షో లో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డితో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నెక్కొండలో ఒకప్పుడు ఒక పంట పండేదని, పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాకనే రెండు పంటలు పండుతున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలకు పరిమితమైన మెడికల్ కాలేజీలను నర్సంపేటకు పెద్ది తీసుకొచ్చినట్లు తెలిపారు. త్వరలోనే నెక్కొండను మున్సిపాలిటీగా చేసేందుకు జీవో జారీ చేసుకుందామని హామీ ఇచ్చారు. మట్టికైనా ఎట్టికైనా మనోడే కావాలన్నారు. కరోనా కాలంలో తెలంగాణ ఖజానా ఖాళీ అయినట్లు తెలిపారు. ఆ సందర్భంలో రైతు బంధు కుదరదని అధికారులు చెప్తే కేసీఆర్ ఒప్పుకో లేదన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టి అయినా రైతులకు రైతుబంధు డబ్బులు వేయాలని పట్టుబట్టిన సంగతిని బయటపెట్టారు. మీ కమాండ్ తో నడిచే కేసీఆర్ కావాలా.. ఢిల్లీ రిమోట్ తో నడిచే కాంగ్రెస్, బీజేపీ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. అయితే కరోనా వల్ల తెలంగాణ రాష్ట్రానికి కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొన్న వచ్చి క్లారిటీ ఇచ్చిందని గుర్తు చేశారు. బోరు బావుల కాడ మీటర్లు పెట్టలేదని రూ. 28 వేల కోట్లు ఆపేసినమని స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే కేసీఆర్ రూ. 28 వేల కోట్లు వదులుకున్నడు కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదని గుర్తు చేశారు. గొంతులో ప్రాణం ఉండగా రైతులకు మీటర్లు పెట్టనివ్వనని తెగేసి చెప్పిన కేసీఆర్ ని మనం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ని నమ్మి రిస్క్ లో పడొద్దన్నారు.
'రిస్క్ వద్దు కారుకు గుద్దు' అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రతి రైతుకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని అంటుందన్నారు. కానీ కేసీఆర్ ఎకరాకు రూ.16 వేలు ఇస్తానన్న సంగతిని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ రైతు బంధు నిధుల విడుదలకు అనుమతినిచ్చిందన్నారు. సోమవారం పొద్దున చాయి తాగే వరకు మీ ఫోన్లు టింగు టింగుమంటాయన్నారు. దేవుడు మన తరపున ఉన్నాడన్నారు. రైతుబంధుకు ఇచ్చినట్టు రుణమాఫీకి కూడా అనుమతి ఇస్తే అది కూడా చేసేస్తామన్నారు. ఒకవేళ అనుమతి రాకపోతే మళ్లీ వచ్చేది కేసీఆర్ కాబట్టి వడ్డీతో కలిపి మాఫీ చేస్తామన్నారు. రైతు బంధు కింద ఇప్పటి వరకు రూ.80 వేల కోట్లు ఇచ్చామని, అలాంటిది మిగిలిన రుణమాఫీ డబ్బులు రూ.4 వేల కోట్లు ఇవ్వలేమా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలతో పాటు సొంతగా డివిజన్ కి ప్రత్యేక పథకాలని తీసుకొచ్చిన పెద్దిని గెలిపించాలని పిలుపునిచ్చారు.