క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు

by Anjali |
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
X

దిశ, హనుమకొండ టౌన్: ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తులకు సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుమల బార్ కూడలి వద్ద సోమవారం రాత్రి పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అక్కడ కొంతమంది ఆన్‌లైన్‌లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు వెళ్లి గోపాలపూర్‌కు చెందిన జీ. రాజేష్, భీమారం గణేష్ నగర్ కాలనీకి చెందిన కె. శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రెండు చరవాణులతో పాటు రూ. 65,080 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు.

Advertisement

Next Story