- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరు గ్యారెంటీలంటున్న కాంగ్రెస్ పార్టీ కే గ్యారెంటీ లేదు – కడియం శ్రీహరి
దిశ, వేలేరు(ధర్మసాగర్): తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ కే గ్యారెంటీ లేదని స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. శనివారం ధర్మసాగర్ మండలం లోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హజరైయ్యారు. కడియం శ్రీహరికి గ్రామగ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు డప్పు చప్పుల్లు, బోనాలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... నాకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్ పూర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో బ్రహ్మండమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని అన్నారు. ఇటివలే కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడ సభలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ లు అమలు సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, జాతీయ పార్టీకి జాతీయ విధానం ఉండాలని, రాష్ట్రానికి ఒక విధానం ప్రకటిస్తున్నారు అంటే ఇది చౌకబారు రాజకీయమేనని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే ఆరు గ్యారెంటీలని కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంటే అవినీతి, స్కాం లేనని, ఆ పార్టీ నాయకుల తీరు దోచుకోవడం దాచుకోవడమేనని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. గతంలో కరెంటు కోతలు ఉండేవని,మోటర్ల కాలిపోయేవని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుంది సీఎం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణలోని పథకాలు అమలవుతున్నాయానని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేతుల్లో తెలంగాణ రాష్ట్రం క్షేమంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలలో ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందా అని ప్రశ్నించారు. రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మీ పథకాలు మీ రాష్ట్రంలో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రల కంటే తెలంగాణ లో అభివృద్ధి ఎక్కువ అని, తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో ఘన్ పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు.
నేను ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరంలోపు కరుణాపురం నుంచి ఎల్కతుర్తి వరకు డబుల్ రోడ్డు వేయిస్తానని హమీ ఇచ్చారు. మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పెద్ద పెండ్యాల గ్రామంలో రూ.30 లక్షల తో మహిళా సంఘం భవనం నిర్మిస్తానని హమీ ఇచ్చారు. పెద్ద పెండ్యాల గ్రామంలో ఆరు నెలల్లో డబుల్ లైన్ సీసీ రోడ్డు వేయించి, డ్రైయినేజీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కుల సంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని తెలిపారు. పార్టీ లో ఏలాంటి గ్రూపు లు లేవని, ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు.
త్వరలోనే మండల సమన్వయ కమిటీ లు, బూత్ కమిటీ లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్లు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారించాలని అన్నారు. దళిత బంధు, గృహలక్ష్మీ పథకాలకు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని, ఎవరైనా లంచం తీసుకున్నట్లు తెలిస్తే వారిని నడిరోడ్డుపై బట్టలిప్పించి నిలబెడుతానని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితారెడ్డి, జడ్పీటీసీ పిట్టల శ్రీలత సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్
మండల పార్టీ అధ్యక్షుడు మునిగెల రాజు, సర్పంచ్ లు ఆకారపు అన్నమ్మ, శరత్ చంద్ర ప్రసాద్, పెసరు రమేష్, గొనేల సమ్మక్క, మాజీ ఎంపీటీసీ తోట నాగరాజు, నారాయణగిరి ఎంపీటీసీ వల్లపురెడ్డి రమాదేవి, పిఏసీఎస్ డైరెక్టర్ మడికంటి రాజయ్య, ఎస్ఎంసి ఛైర్మన్ వక్కల కరుణాకర్, ఉపసర్పంచ్ వెంకట్రాజం, ఎన్ఆర్ఐ వల్లపురెడ్డి రాం రెడ్డి, రైతు కో ఆర్డినేటర్ రమేష్, మల్లిఖార్జున స్వామి ఆలయ డైరెక్టర్ గంటే బాలకుమార్, మాజీ ఉపసర్పంచ్ పుట్ట కుమార్, కడియం సోషల్ మీడియా, రామన్న యువసేన అధ్యక్షుడు గంటే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.