రక్తమయమైన కోట గండి.. బారులు తీరిన భక్తులు

by Aamani |   ( Updated:2024-10-12 04:46:45.0  )
రక్తమయమైన కోట గండి.. బారులు తీరిన భక్తులు
X

దిశ,గీసుగొండ: విజయదశమి సందర్భంగా కోట మైసమ్మ తల్లికి వాహనదారులు గొర్రెలను, మేకలను,కోళ్లను బలి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. కాకతీయుల కాలం నాటి కోట గండి మైసమ్మ తల్లికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి దసరాకి వాహనదారులు తమ వాహనాలతో కోట గండి మైసమ్మ తల్లి వద్దకు చేరి గొర్రెలను బలి ఇస్తే ప్రమాదాలు జరగవని వారి నమ్మకం. విజయదశమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే వాహనదారులు పెద్ద సంఖ్యలో కోట మైసమ్మ తల్లి వద్దకు వచ్చి బారులు తీరారు.కోట మైసమ్మ తల్లి ఆలయ అర్చకులు అయ్యప్ప అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,నిమ్మ దండలతో ప్రత్యేకంగా అలంకరించారు. వాహనదారులు,వారి వాహనాలతో పెద్ద సంఖ్యలో రావడంతో వరంగల్ నర్సంపేట ప్రధాన రహదారి కిక్కిరిసి పోయింది. వాహనదారులు అధిక సంఖ్యలో పాల్గొని, గొర్రెలను బలి ఇవ్వడంతో కోట మైసమ్మ తల్లి ఆలయ ప్రాంగణం రక్తమయమైంది.

Advertisement

Next Story