రుణమాఫీపై వినతుల కోసం మండలానికో అధికారిః కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

by Nagam Mallesh |
రుణమాఫీపై వినతుల కోసం మండలానికో అధికారిః కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
X

దిశ, బచ్చన్నపేట :రైతులు రుణమాఫీపై వినతులు అందించేందుకు ప్రతి మండలంలో ఒక వ్యవసాయ శాఖ అధికారిని నియమించినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. బచ్చన్నపేట మండలానికి విద్యాకర్ రెడ్డిని నియమించారు. మండలాలలో వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలోనూ రైతు వేదికలోనూ అధికారులు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. ప్రతి రైతు సమస్యను పరిష్కరించే వరకు రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఈ విషయమై సంబంధిత అధికారులని మండలాల్లో కలిసి వినతులు అందించవలసిందిగా తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed