- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌ను చూస్తే సీఎం కేసీఆర్‌కి భయం: Challa Narayana Reddy
దిశ, కొత్తగూడ: తెలంగాణలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్తుంటే పోలీసులు ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం దారుణమని కాంగ్రెస్ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ వార్ రూమ్‌పై దాడికి నిరసనగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ఎత్తున్న నిరసన కార్యక్రమం, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను చూస్తే కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రచారం చేస్తే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుక్కున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. హౌజ్ అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని మండిపడ్డారు.
సుంకరబోయిన మొగిలి మాట్లాడుతూ.. కాంగ్రెస్ వార్ రూమ్‌లో డేటాను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇది దొంగతనమని, ఓడిపోతున్నామనే భయంతోనే సీఎం కేసీఆర్ ఈ విధమైన దాడులకు పాల్పడుతున్నారన్నారు. అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లావణ్య వెంకన్న జిల్లా నాయకులు, బాణోత్ విజయ రూఫ్సింగ్ ఎంపీపీ, కాడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ, బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి, బూర్క పుష్పలత నరేందర్ ఎంపీటీసీ, బోనగిరి యాకయ్య డైరెక్టర్, గుమ్మడి సమ్మయ్య మాజీ సర్పంచ్, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు