- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె.. సీఎం కేసీఆర్
దిశ, ములుగు ప్రతినిధి : బీఆర్‌ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ములుగు నియోజకవర్గంలో శుక్రవారం తంగేడు స్టేడియంలో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవగా హెలికాప్టర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సభాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మంచినీరు ఇచ్చారా ? కాంగ్రెస్ పాలనలో కరెంటు ఇచ్చారా ? రైతుబంధు ఇచ్చారా ? మరి ఇవాళ ఇవన్నీ మేం ఇచ్చాం కదా ? మీ కాంగ్రెస్ కాలంలో పోడు భూములు పంచారా ? ఇవాళ మేం పంచినం కదా ? మరి ఏం చేశారంటే..? నేను చెప్పేదంటే ఈ వాదులాటలు కాదు. జరగాల్సింది ప్రజల క్షేమం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కాల్చి చంపుడే కదా..? ఇది ముఖ్యంగా గిరిజన ప్రాంతం ముఖ్యంగా సమస్యలు ఎక్కువగా ఉంటయ్ రోడ్లు, ఇరిగేషన్ అన్నీ చేసిపెడుతానని వాగ్ధానం చేస్తున్నా బడే నాగజ్యోతి చరిత్ర మీకు తెలుసు అని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె..
కాంగ్రెస్ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఇందిరమ్మ రాజ్యంలో ఏం మంచిగుండె. ఎన్‌కౌంటర్లు, కాల్చి చంపుడు.. ఎమర్జెన్సీపెట్టి జైళ్లలో వేసుడే ఉండెకదా? ఓ బానిస బతుకుల్లా ఉండే. అటువంటి దుర్మార్గమైన ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లో పోయి అమరుడైండు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిండు. ఆయన స్వార్థం కోసం కాలేదు. ప్రజల పక్షాన కొట్లాడేందుకు వెళ్లి బలయ్యారు. అలాంటి వ్యక్తి బిడ్డ నాగజ్యోతి. తల్లిలేదు తండ్రి లేదు.. ములుగు ప్రజలు నా తల్లిదండ్రులని చెప్పింది. నేను మీ అందరినీ కోరుతున్నా. ఆమె కష్టపడి చదువుకున్నది. ఉన్నత విద్యావంతురాలుగా ఎదిగింది. సర్పంచ్‌గా పని చేసి ఇవాళ జిల్లా పరిషత్ చైర్మన్ హోదాకు వచ్చింది అన్నారు.
నాగజ్యోతిని గెలిపించకుంటే పంచాయితీ పెట్టుకుంట.
మీతో నేను మీ అందరినీ కోరేది నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా గ్యారంటీగా వెలుగుతుంది. నాగజ్యోతిని గెలిపిస్తే నేను ఇక్కడే రెండురోజులు క్యాంప్‌లో ఉంటాను నేను స్వయంగా మీతోని మాట్లాడుతాను ఎక్కడ ఏం అవసరాలున్నయో వందశాతం చేసే బాధ్యత నాది అని మనవి చేస్తున్నాఅన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లు గెలిచేది లేదు సచ్చేది లేదు ఇవాళ నేను తిరిగేది 80వ నియోజకవర్గం కావొచ్చు ఇంకో 20 తిరిగితే అయిపోతది ఏం గాలి లేదు తుస్సుమన్నది ఎక్కడా ఏం లేదు అది వచ్చేది లేదు సచ్చేది లేదు అన్నారు. లాస్ట్ టైమ్ గెలిపించకుంటే నేను మీ మీద అలుగలేదు కానీ, ఇప్పుడుమాత్రం పంచాయితీ పెట్టుకుంటా ములుగు అభివృద్ధి కావాలంటే గవర్నమెంట్ ఉండే పార్టీ గెలిస్తేనే మంచి లాభం జరుగుతుంది. పనులు ఎక్కువ జరుగతయ్ ఆ అమ్మాయి ఇక్కడే పుట్టింది ఇక్కడే పెరిగింది. కుటుంబ త్యాగాలు మీకు తెలుసు. అందరూ బడే నాగజ్యోతిని దీవించండి. మీకు కావాల్సిన పనులన్నీ చేసినపెడుతాను’ అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
వర్షాన్ని సైతం లెక్కచేయని పార్టీ శ్రేణులు, ప్రజలు..
శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి ప్రజాఆశీర్వాద సభ జరగనుండగా ఉదయం నుండి ములుగులో చెదురుమదురుగా వర్షపు జల్లులు పడుతూనే ఉన్నాయి. ఒకానొక సమయంలో సభ వాయిదా పడుతుందని అందరూ అనుకున్న మధ్యాహ్నం సమయంలో వర్షం విరామం ఇవ్వడంతో పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశారు. సభాస్థలికి కెసిఆర్ రావడం కొంత లేట్ అయిన సమయంలో మళ్లీ చిన్నపాటి వర్షం కురిసిన పార్టీ శ్రేణులు గాని సభకి వచ్చిన ప్రజలు తిరిగి వెళ్ళిపోకుండా కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురుచూడడం గమనార్హం.
సభా ప్రాంగణంలో పోలీసుల అత్యుత్సాహం..
ప్రజా ఆశీర్వాద సభలో పోలీసుల అత్యుత్సాహం స్పష్టంగా కనబడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సందర్భంగా విలేకరుల కోసం ప్రత్యేకంగా పోలీసు వారు జారీచేసిన పాసులను సైతం సభ ప్రాంగణంలోని పోలీసు వారు లెక్కచేయకుండా విలేకరులను మీడియా గ్యాలరీలోకి పంపించకుండా అడ్డుకోవడంతో పోలీసులకు విలేకరులకు మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో విలేకరులు సభను బైకాట్ చేసి బయటకు వస్తున్న సమయంలో తిరిగి పోలీసులు విలేకరులను అనుమతించి మీడియా గ్యాలరీకి పంపించారు.