- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రారంభానికి నోచుకోని చిట్యాల బస్టాండ్
దిశ, చిట్యాల: చిట్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రజల అవసరాలను తీర్చకుండానే అధికారుల నిర్లక్ష్యానికి నిరుపయోగంగా మారింది. ఎన్నో ఏళ్ల కల.. కలగానే ఊగిసలాడుతుంది. గత ప్రభుత్వం నిర్మించిన చిట్యాల బస్టాండ్ ఏళ్లు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. మండల కేంద్రంలో అన్ని రకాల ఆఫీసులు మండల ప్రజలతో కళకళలాడుతున్నాయి. ఒక్క బస్టాండ్ మాత్రమే ప్రారంభానికి నోచుకోక వెలవెలబోతుంది. చంద్రుడికి మచ్చ ఎలాగనో చిట్యాల మండలం లో బస్టాండ్ కూడా ప్రారంభం కాకుండా ఓ మచ్చలా కనిపిస్తుంది. గత ప్రభుత్వం బస్టాండ్‌ను మాత్రమే నిర్మించింది. కానీ బస్టాండ్ ఆవరణలో కనీస మౌలిక వసతులైన తాగునీరు, మూత్రశాలలు, విద్యుత్ ఏర్పాటు, బస్టాండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయలేదు. అయితే నిధులు లేకనా లేక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారా అనే సందిగ్ధంలో మండల ప్రజలు ఉన్నారు.
దశాబ్దం కిందనుంచే ప్రతి బస్సు ఇప్పుడు నిర్మించిన బస్టాండ్‌కి వచ్చి వెళ్లేవి. నైటాల్ టు బస్ నిద్రించి తెల్లవారి వెళ్లేది. నేడు చిట్యాలలోని అంబేడ్కర్ సెంటరే బస్టాండ్ అనే విధంగా మారింది. బస్సులు సెంటర్‌కే రావడం, వెళ్లడంతో ప్రయాణికులు కూడా బస్సులు అక్కడే ఎక్కడం, దిగడం చేస్తున్నారు. సెంటర్ లో కూడా ప్రజలకు కావాల్సిన మౌలిక వసంతులు లేక, మహిళలు, చిన్నపిల్లలు, ప్రయాణికులు ఎండనక, వాననక అనేక అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలో రూ.లక్షలు వెచ్చించి, నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా ఉండడాన్ని చూసిన ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బస్టాండ్ ముందున్న ప్లాట్ ఫామ్ నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు వెంచ్చించి వెంటనే పూర్తి చేయించారు.
ప్రజల ఎదురు చూపు..
అయితే బస్టాండ్ ప్రారంభం కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు ఆ బస్టాండ్ అసాంఘిక కార్యకలాపాలకు, మద్యం ప్రియులకు నిలయంగా మారేందుకు అవకాశం ఉంది. బస్టాండ్ సమీపంలో మద్యం దుకాణాలు ఉండడంతో పాఠశాలకు అతి సమీపంగా ఉండడం ద్వారా విద్యార్థులు, మహిళలు అనేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థులు వాటికి ఆకర్షితులై అలవాటు చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మద్యం దుకాణాలను పాఠశాల, బస్టాండుకు దూరంగా తరలించాలని మండల ప్రజలు కోరుతున్నారు. బస్సులు అంబేద్కర్ సెంటర్ వరకే రావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే మొగుళ్లపల్లి, నవాబుపేట ప్రజలు, కేజీబీవీ స్కూలుకు వెళ్లే హాస్టల్ పిల్లలు వానకు, ఎండకు కొంత అసౌకర్యం తో పాటు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా బస్టాండ్‌కు సంబంధించి స్థల సరిహద్దులను అధికారులు నిర్ణయించి ప్రహరీ నిర్మాణం చేసి భూమి అన్యక్రాంతానికి గురి కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. బస్టాండ్‌కు బస్సులు రాకపోవడంతో చిరు వ్యాపారులు వారి జీవనోపాధిని కోల్పోతున్నారు. డీఎం రవిచందర్‌ను ఫోన్లో వివరణ కోరగా బస్టాండ్‌ను పర్యవేక్షిస్తానని అన్నారు. బస్సులు వచ్చేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.