- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ ఎన్నికలు పాలిటిక్స్ ఆఫ్ వర్క్ వర్సెస్ పాలిటిక్స్ ఆఫ్ అబ్యుస్ అని ఢిల్లీ చీఫ్ కేజ్రీవాల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ మంగళవారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం ఆయన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఎన్నికల తేదీ వచ్చేసింది. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మీరే మా బలం. పాలిటిక్స్ ఆఫ్ వర్క్‌కు, పాలిటిక్స్ ఆఫ్ అబ్యుస్(దుర్వినియోగానికి) మధ్య ఈ సమరం జరగనుంది. ఢిల్లీ ప్రజలకు తాము చేసిన పనుల పట్ల నమ్మకం ఉంది. తప్పకుండా తామే గెలుస్తాం.’ అని కేజ్రీవాల్ అన్నారు. మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి పోటీ చేస్తున్న పర్వేష్ వర్మ సైతం షెడ్యూల్ అనంతరం మాట్లాడారు. ‘ప్రజాస్వామ్య పండుగ ప్రారంభం అయినందుకు ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు. అందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఈవీఎంను కేజ్రీవాల్ ప్రతిసారి సాకుగా చూపుతారు. ఇండియా కూటమి సభ్యులు సైతం ఓటమి భయంతోనే ఈవీఎంలను నిందిస్తుంటారు. వచ్చే నెలలో బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.’ అని పర్వేష్ వర్మ అన్నారు.