గురుకుల పాఠశాలలో సంచలనం.. మైనర్ బాలికను వేధించిన క్యాటరింగ్ వర్కర్..

by Nagam Mallesh |
గురుకుల పాఠశాలలో సంచలనం.. మైనర్ బాలికను వేధించిన క్యాటరింగ్ వర్కర్..
X

దిశ, పాలకుర్తి/తొర్రూరు: మైనర్ బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగికంగా వేధిస్తున్న సంఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని నెల రోజులుగా సెలవులపై ఇంటికి వెళ్లి ఇంటి వద్దనే ఉంటుండడంతో బాలిక తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించారు. వెంటనే బాలిక ఏడ్చుకుంటూ.. పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ శ్రీకాంత్ అనే వ్యక్తి తనను గత కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నట్టు బాలిక, తల్లిదండ్రులకు బోరున విలపించింది. వెంటనే తల్లిదండ్రులు పాలకుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులను మరియు కేటరింగ్ వర్కర్ శ్రీకాంత్ ను మందలించారు. అనంతరం పాలకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసన్నకుమార్ తెలిపారు.

Advertisement

Next Story