- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రయాణికుల బస్సులో కార్గో పార్సిల్స్..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్గో సేవలు ప్రయాణికుల పాలిట షరాఘతమవుతున్నాయి. లాభాలను ఆర్జించాలనే టీఎస్ఆర్టీసీ అధికారుల ఉద్దేశం ప్రయాణికులకు సంకటంగా మారింది. ప్రయాణికులను తరలించే ఆర్టీసీ బస్సుల్లో కార్గో పార్సిళ్లను తరలిస్తున్నారు. కార్గో సంస్థలో సిబ్బంది అధికంగా లేకపోవడం, ఒకేసారి అన్ని బస్సుల నుంచి పార్సిల్స్ వస్తుండడంతో సకాలంలో స్టేషన్లో దిగుమతి చేసుకోలేక పోతున్నారు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి భూపాలపల్లి డిపోకు చెందిన బస్సు బయలుదేరాల్సి ఉంది. కార్గో సేవల కోసం బస్సులో పార్సిల్స్ నింపడం కోసం సుమారు గంటసేపు బస్ స్టేషన్‌లోనే ఉంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దిశ, కాటారం : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కార్గో సేవలు ప్రయాణికుల పాలిట షరాఘతమవుతున్నాయి. టీఎస్ఆర్టీసీ వికృత చేష్టలతో లాభాలను ఆర్జించాలనే ఉద్దేశం ప్రయాణికులకు సంకటంగా మారింది. కార్గో సంస్థలో సిబ్బంది అధికంగా లేకపోవడం, ఒకేసారి అన్ని బస్సుల నుంచి పార్సిల్స్ వస్తుండడంతో సకాలంలో స్టేషన్లో దిగుమతి చేసుకోకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల్లోనే వేచి చూస్తున్న సంఘటన నూతన సంవత్సరం రోజున చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి భూపాలపల్లి డిపోకు చెందిన బస్సు నంబర్ టీఎస్25జెడ్0046 బయలుదేరాల్సి ఉంది. కార్గో సేవల కోసం బస్సులో పార్సిల్స్ నింపడం కోసం సుమారు గంటసేపు బస్ స్టేషన్‌లోనే ఉంచారు. సుమారు 82 పార్సిల్స్‌ను బస్సులో వేశారు. ప్రయాణికులు కూర్చునే సీటుతోపాటు, డ్రైవర్ సీట్, వెనకాల, బస్సు ఇంజిన్ పైన పెద్దపెద్ద పార్సిల్స్ వేశారు. మొత్తం సామాగ్రితో నింపేశారు. చిన్న వ్యాన్ లోడును వేశారు. రాత్రి 7గంటలకు బయలుదేరాల్సిన బస్సు 7:40 గంటలకు బయలుదేరింది. ఈ మొత్తం పార్సిల్స్ అన్ని హనుమకొండ బస్ స్టేషన్‌లో దింపేందుకు మళ్లీ గంట సేపు సమయం తీసుకున్నారు. రాత్రి 11:20కి చేరిన బస్సు 12:35కు కాళేశ్వరం బయలుదేరింది.
రాత్రివేళ కావడం ఆర్టీసీ కార్గో సంస్థలో సిబ్బంది ఎక్కువగా లేకపోవడంతో ఇతర బస్సుల్లో పార్శిల్లు దింపి ఈ బస్సులోని 82 పార్సిల్లు దిగుమతి చేశారు. లెక్కచూసేసరికి మరో గంట సమయం పట్టింది. ఇన్ని పార్సిల్స్ ఒకేసారి తీసుకెళ్లేందుకు ఇంత ఆలస్యం అయితే ఎలా అని డ్రైవర్, కండక్టర్‌ను అడిగితే కార్గో పార్శిల్లు తీసుకువెళ్లకపోతే పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుందని, తప్పక తీసుకెళ్లాల్సిందేనని జవాబిచ్చారు. నూతన సంవత్సర వేడుకలు తమ గృహాల వద్ద చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రజలు బస్సులోనే వేచి చూడాల్సి వచ్చింది. ప్రయాణికుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. కార్గో సేవలందిస్తున్న ఆర్టీసీ ఒక బస్సులో ఇన్ని పార్సెల్ మాత్రమే వేయాలని నిబంధన లేకపోవడం, కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా తీసుకోకపోవడం, నిబంధనలను పాటించే డ్రైవర్లకు ఇది ఆశనిపాతంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. సేవలతోపాటు ప్రయాణికుల అమూల్యమైన సమయాన్ని సమతుల్యత జరిగేలా ఇబ్బందులు రాకుండా చూడాలని ప్రయాణికులు ఆర్టీసీ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.