కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు బీఆర్ఎస్ సృష్టించిన కరువు : యశస్విని రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు బీఆర్ఎస్ సృష్టించిన కరువు : యశస్విని రెడ్డి
X

దిశ, పెద్దవంగర : కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు బీఆర్ఎస్ సృష్టించిన కరువు అని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని చిన్న వంగర, చిట్యాల, బొమ్మకల్ గ్రామాలలో సోమవారం కార్నర్ మీటింగ్ లలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కరువు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాయని, రెండు పార్టీలు సింపతీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మొన్నటి వరకు అధికారంలో వున్న బీఆర్ఎస్ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అబద్దాలు చెప్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమర్థవంతంగా ప్రజలకు అందిస్తుందన్నారు.ఆరోగ్య శ్రీ తోపాటు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, రూ.500వందలకే గ్యాస్, 200 యూనిట్ల ఉచిత కరెంట్, త్వరలోనే రుణమాఫీ చేయబోతుందన్నారు.

వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యకు భారీ మెజారిటీతో గెలిపిస్తే కేంద్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయన్నారు. అంతకుముందు ఉపాధిహామీ కూలీలలతో ముచ్చటించి బ్యాలెట్ నమూనాను చూపించి కడియం కావ్యకు ఓటేయాలని కోరారు. ఆమె వెంట ఎీపీపి కల్పన రాజు యాదవ్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, పీఎసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, మాజీ పీసీసీ సభ్యులు నిరంజన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి సైదులు, దేవస్థాన డైరెక్టర్ వేణు, నాయకులు ప్రవీణ్ రావు, శ్యామ్,వెంకన్న నాయక్, దాసరి శ్రీనివాస్, హరికృష్ణ, జానీ, రాము రెడ్డి, యసారపు కృష్ణ,నాగేష్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed