- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పత్తి కొనుగోళ్లలో గం'దర'గోళం
దిశ, వరంగల్ టౌన్ : పత్తి రైతుకు నిర్వేదమే మిగులుతోంది. గత నెల రోజులుగా ధరలపై ఆందోళన చెందుతున్న రైతుకు సోమవారం అసలుకే ఎసరుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్కెట్లో వ్యాపారాలు అనూహ్యంగా కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యాపారులు అడ్డుపుల్ల!
పత్తి మార్కెట్ గత నెల మొదటి వారంలో ప్రారంభమైంది. అధికారికంగా రూ.7521 ధరతో సిపిఐ కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 8 -12 శాతం తేమ నిబంధనలు విధించింది. ఆ నిబంధనలే ఇప్పుడు రైతుకు శాపంగా మారింది. ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లలో ఏ ఒక్కరోజు సీసీఐ నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ.7521 ఏ ఒక్క రైతు పొందలేదు. ఈ నేపథ్యంలో నిరంతరం మార్కెట్ లో ధరలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తేమ శాతాన్ని 18 నుంచి 25 మధ్య నిర్ణయించాలని డిమాండ్లు అటు రైతులు ఇటు వ్యాపారుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇదే క్రమంలో వ్యాపారాలు సోమవారం కొనుగోళ్లకు చెక్ పెట్టారు. సిసిఐ విధించిన తేమ నిబంధనలు, అలాగే మిల్లులు వద్ద కొనుగోళ్లు చేపట్టకపోవడంపై వ్యాపారాలు నిరసనకు దిగారు. సోమవారం ఉదయం లావాదేవీలు నిలిపివేశారు.
అయోమయంలో రైతులు
అయితే వ్యాపారాలు అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో రైతులు ఒకసారిగా అవాక్కు చెందారు. రెండు రోజుల సెలవు తర్వాత మార్కెట్ కు సరకుతో వచ్చిన రైతులు వ్యాపారుల నిర్ణయంతో హతాశులయ్యారు. ఒకపక్క తేమ పేరిట ధరలు తగ్గించడమే కాకుండా ఉన్నట్టుండి వ్యాపారాలు కొనమని చెప్పడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
మార్కెట్ అధికారులు విఫలం!
పత్తి కొనుగోలు ప్రారంభం అయిన నాటి నుంచి మార్కెట్ అధికారుల తీరుపై విమర్శలు వెళ్లువెత్తుతూనే ఉన్నాయి. ధరల నిర్ణయంలో మొదటి నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. మార్కెట్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగానే వ్యవరిస్తున్నారు. తాజాగా సోమవారం వ్యాపారాలు కొనుగోళ్లు నిలిపివేసే నిర్ణయం కూడా తమకు తెలియదని పేర్కొనడం రైతుల సంక్షేమం, మార్కెట్ కార్యకలాపాలపై వారికి ఉన్న నిబద్ధతకు అద్దం పడుతుంది.
అయినా అదే ధర!
కొండంత రాగం తీసి ఏదో పాడినట్లు వ్యాపారులు పత్తి కొనుగోళ్ల నిలిపివేత కూడా అదే తీరును ఎత్తిచూపుతోంది. వాస్తవంగా తేమ పేరిట రైతులు నష్టపోతున్నారని మొదటి నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యాపారాలు కూడా అదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. తేమ సాకుతోనే ఇప్పటివరకు కనీస మద్దతు ధర చెల్లించేందుకు కూడా వ్యాపారులు వెనుకంజ వేస్తూ వస్తున్నారు. తాజాగా సోమవారం మార్కెట్లో కొనుగోళ్లు నిలిపివేసినా చివరకు రైతులకు మాత్రం జరిగిన న్యాయం శూన్యమే. సిసిఐ నిర్ణయించిన ధర కంటే రూ.600 కు తక్కువ ధరతోనే కొనుగోలు చేపట్టడం రైతుల పట్ల వారికున్న వ్యాపార వృద్ధిని తేటతెల్లం చేస్తోంది.
ఐదు గంటలు ఉత్కంఠ!
సోమవారం పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెండు రోజుల సెలవుల తర్వాత పత్తి విక్రయించేందుకు రైతులు ఆదివారం అర్ధరాత్రి నుంచే మార్కెట్ కు దారి పట్టారు. అయితే అనూహ్యంగా వ్యాపారాలు కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ఉదయం 8 గంటలకు చెప్పడం రైతులను మానసికంగా కుంగ తీసింది. దాదాపు 5:30 గంటల తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత వ్యాపారాలు కొనుగోళ్లకు దిగారు. దీంతో రైతులకు ప్రాణం వచ్చినట్లయింది.