- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ అవినీతిలో బీజేపీకి వాటాలు..
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో బీజేపీ పార్టీకి వాటాలు అందుతున్నాయని కేంద్ర మాజీమంత్రి పోరిక బలరాం నాయక్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టు బాట ధర లేక, ఎరువుల ధరలు పెంచి రైతుల రక్తం తాగుతున్నారని అన్నారు. ఇతర పార్టీల వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై పోరాటం చేయడానికి కలిసి రావాలన్నారు. వరంగల్ మోడీ సభ, కేసీఆర్ డైరక్షన్ లో జరిగందన్నారు.
బీఆర్ఎస్ ను ఎదుర్కొనే ప్రణాళిక ప్రకటన చేయకపోవడం చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమవుతుందన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ గా ఉన్నప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయగా, ఈ ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలిస్తుంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ప్రశ్నించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ ప్రజలను దోచుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఘనపురపు అంజయ్య, మేకల వీరన్న యాదవ్, నెల్లికుదుర్ మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, తోట వెంకన్న, అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.