- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరంగల్ పశ్చిమలో రాకేష్‌రెడ్డి దూకుడు..!
దిశ, వరంగల్ బ్యూరో : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి వరంగల్ పశ్చిమలో దూకుడు పెంచారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ టికెట్ ఆశిస్తున్న రాకేష్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరు సలుపుతూనే, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. హన్మకొండ, కాజీపేట పట్టణాల్లోని మురికి వాడల్లో పర్యటిస్తూ జనం ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. కాలనీల్లో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తూ..నిర్లక్ష్య వైఖరిపై నిలదీస్తున్నారు. మార్నింగ్ వాక్ , చాయ్ పే చర్చ, కాలనీ విజిట్ వంటి కార్యక్రమాలతో జనంతో మమేకమవుతున్నారు.
నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని, అక్రమాలపై ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు వరుసగా లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న రాకేష్ రెడ్డి స్వతహాగా ఉన్నత విద్యావంతుడు కావడంతో ప్రభుత్వ వైఫల్యాలను లెక్కలు, ఆధారాలతో సహా ఎండగడుతూ పశ్చిమ ఎమ్మెల్యేను ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను తన పర్యటనల ద్వారా ఎత్తి చూపడం సక్సెసవుతున్నారనే చెప్పాలి.
పశ్చిమలో మారుతున్న పొలిటికల్ సీన్..
రాకేష్ రెడ్డి దూకుడు పెంచడంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ మారుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌పై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి రాకేష్ రెడ్డికి టికెట్ దక్కితే ఆ పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం రాజకీయ పరిస్థితులపై చాణక్య సర్వేలో ఆయన ద్వితీయ స్థానంలో ఉండటం గమనార్హం. పార్టీ అధిష్ఠానం పెద్దలు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉన్న సీటుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. వరంగల్ పశ్చిమలో విద్యావంతులు, నిరుద్యోగులు, యువత మద్దతు ఆయనకు ఉంటుందని సర్వేల్లో తేలినట్లు సమాచారం. దీనికి తోడు రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఉండటం ఆయనకు బాగా కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.
టికెట్ రాకేష్ రెడ్డికేనా..?!
జనం బలం లేకుండా కేవలం పార్టీ ముఖ్య నేతలను నమ్ముకుంటే ప్రయోజనం ఉండదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలోని బలంగా ఉన్న నేతలకు టికెట్లంటూ ఇప్పటికే అధిష్ఠానంలోని కీలక నేతలు ప్రకటించారు. సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని ఖరాఖండిగా చెబుతుండటంతో ఆయన అనుచరుల్లో జోష్ కనిపిస్తోంది. రాకేష్ రెడ్డి పోటీ చేస్తూ వరంగల్ పశ్చిమలో పార్టీ గెలిచే అవకాశం ఉందని పలు సర్వేల్లో వెల్లడి కాగా, పార్టీ చేయిస్తున్న సర్వేల్లోనూ రాకేష్ రెడ్డికి సానుకూలతగా విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో టికెట్ విషయంలోనూ విస్పష్టమైన సంకేతాలు వెలువడ్డేనంటూ పార్టీ సీనియర్ల ద్వారా తెలుస్తోంది. గెలిచే అభ్యర్థినే నిలబెట్టాలంటూ ఇప్పటికే పలువురు సీనియర్లు పార్టీ పెద్దలకు విన్నవించినట్లు సమాచారం. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి పోటీ చేయడం ఖాయమన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తుండటం విశేషం.
Also Read: టీ- బీజేపీ ఆశలన్నీ ఆ సభపైనే.. బలం లేదన్న చోటనే గ్రాండ్ సక్సెస్ చేసేలా భారీ వ్యూహం..!