తెలంగాణలో రానున్నది BJP సర్కారే.. ఆ తర్వాత లెక్కలన్నీ తేలుస్తాం: కేంద్రమంత్రి BL వర్మ

by Satheesh |   ( Updated:2023-01-22 13:31:03.0  )
తెలంగాణలో రానున్నది BJP సర్కారే.. ఆ తర్వాత లెక్కలన్నీ తేలుస్తాం: కేంద్రమంత్రి BL వర్మ
X

దిశ, హనుమకొండ టౌన్: తెలంగాణలో రానున్నది బీజేపీ సర్కార్ అని.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక అన్ని లెక్కలు తెలుస్తామని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, సహకార శాఖల సహాయక మంత్రి బీ.ఎల్. వర్మ హెచ్చరించారు. పార్లమెంట్ ప్రవాస్ యోజన పర్యటనలో భాగంగా మంత్రి బీ.ఎల్. వర్మ ఆదివారం హన్మకొండలో పర్యటించారు. హన్మకొండ శాయంపేట నుండి పద్మక్షమ్మ ఆలయం వరకు కేంద్ర మంత్రి కాలినడకన కలియతిరిగి పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి హన్మకొండలో జరుగుతున్న అక్రమాలపై, స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ నిధుల దుర్వినియోగం, గతంలో వరదల కారణంగా జరిగిన నష్టం గురించి కేంద్ర మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బీఎల్ వర్మ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ, హృదయ్ పథకాల నిధులు దారి మళ్లిస్తున్నారని, నగరం రూపు రేఖలు చూస్తుంటే అది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ కింది స్థాయిలో అమలు చెయ్యకుండా, నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ మీద ప్రేమతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడు స్కీంలు స్మార్ట్, అమృత్, హృదయ్ పథకాలలో చేర్చి నిధులు పంపుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులను దారి మళ్ళిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి, హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, స్థానిక కార్పొరేటర్ రావుల కోమలా కిషన్, తల్లపెల్లి కుమారస్వామి, రావుల కిషన్, గండ్రాతి శ్రీనివాస్‌లు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed