- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిజికల్ ఫిట్ నెస్ ఇవ్వడం కోసమే రన్ : గండ్ర వెంకటరమణారెడ్డి
దిశ, భూపాలపల్లి : ఆదివారం ఉదయం 6 గంటలకు భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2022 రన్ విజయవంతంగాముగిసింది. భూపాల్ పల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్రా జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన 2002 రన్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు యువకులు పాల్గొని విజయవంతం చేశారు. ఆదివారం రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో, భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భూపాలపల్లి రన్ -2022 5km,10km,21km రన్‌ను శాసన సభ్యులు ప్రారంభించిన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా , సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేందర్ రెడ్డి,అడిషనల్ కలెక్టర్ దివాకర్, అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇందులో దాదాపు 600 మంది రన్నర్ లు పాల్గొన్నారు. భూపాలపల్లి రన్ -2022 లో పాల్గొన్న వారికి బిబ్స్, టిషర్ట్స్ ను అందచేశారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యము అని పెద్దలుఅన్నారని ప్రతి ఒక్కరూ ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండాలని, భూపాలపల్లి ప్రజలకు నూతన ఉత్సాహం నింపి ఫీజికల్ ఫిట్ నెస్ ఇవ్వడం కోసం భూపాలపల్లి రన్ ను కార్యక్రమం తోడ్పడుతుందన్నారు. భూపాలపల్లిలో మొదటిసారిగా రన్నింగ్ ప్రారంభించడం జరిగిందని, మారథాన్‌లో అనేక పథకాలు సాధించిన వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి కోరిక మేరకు,వారి కోచ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి రన్ -2022 ని ప్రారంభించడం జరిగిందని, చాలా మంది రన్నర్స్ ఇందులో పాల్గొని మొదటి సారి జరిగిన ప్రోగ్రాంని విజయవంతం చేశారని, రాబోయే రోజుల్లో దీన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. నేను ఒక మారథాన్ రన్నర్‌గా..భూపాల్ పల్లిలో ప్రారంభించాలని గత రెండు సంవత్సరాల నుండి అనుకుంటున్నప్పటికీ కరోనా వలన వీలు కాలేదని, ఏది ఏమైనా ఈ రోజు విజయవంతంగా భూపాలపల్లిలో రన్ ప్రారంభించి కంప్లీట్ చేసుకుంన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని, నా కోచర్ జగన్మోహన్ రెడ్డి సలహా సూచనల మేరకు వారి ఆధ్వర్యంలో భూపాలపల్లి రన్ ని విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నామని అన్నారు.
విజేతలు వీరే.
భూపాలపల్లి రన్ -2022 విజేతలు
5 KM రన్ పురుషుల విభాగం
ప్రథమ బహుమతి: S అశోక్
ద్వితీయ బహుమతి: M. నగేష్
తృతీయ బహుమతి: B. రాజు
L5 KM రన్ మహిళ విభాగ
ప్రథమ బహుమతి : . నిత్య
ద్వితీయ బహుమతి: P. ప్రాచీ
తృతీయ బహుమతి: H. సంధ్య రాణి
10 KM పురుషుల విభాగం
ప్రథమ బహుమతి : V. ధనుష్
ద్వితీయ బహుమతి : అనిల్ కుమార్
తృతీయ బహుమతి : D కిరణ్
10 KM మహిళ విభాగం
ప్రథమ బహుమతి : K. కమల
ద్వితీయ బహుమతి : J. జయ లక్ష్మి
తృతీయ బహుమతి : B. భావన గురిజల
21 KM పురుషుల విభాగం
ప్రథమ బహుమతి : */G. అభిషేక్
ద్వితీయ బహుమతి: విజయ్ కుమార్
తృతీయ బహుమతి : ఎండీ.రఫీ
21KM మహిళ విభాగం
జ్యోతి
జి ఎమ్ అర్ ఎమ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటి బహుమతి రూ.5000/-,ద్వితీయ బహుమతి రూ.3000/-, తృతీయ బహుమతి రూ.2000/- బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో రన్నర్స్ తో పాటు MLA గండ్ర వెంకట రమణా రెడ్డి గారు,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గారు, సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ సురేందర్ రెడ్డి గారు, అడిషనల్ కలెక్టర్ దివాకర్ గారు,అడిషనల్ SP శ్రీనివాస్ గారు రన్నర్స్ తో పోటి పడ్డాడు. వీరితోపాటు అధికారులు,టీఆర్ఎస్ పార్టి నాయకులు కూడా పాల్గొన్నారు.