- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీసీ ఆస్తుల పై అక్రమార్కుల కన్ను..!
దిశ, డోర్నకల్ : మానుకోట జిల్లాలోనే పెద్ద నియోజకవర్గం. అధిక శాతం గిరిజన ప్రజలున్న డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం. ఈ కేంద్రంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం ప్రయాణికుల సౌకర్యార్థం రెండున్నర ఎకరాల స్థలంలో బస్సు ప్రాంగణం నిర్మించారు. కాలక్రమేనా బస్టాండ్ లోకి బస్సుల రాకపోకలు నిలిచాయి. బస్టాండ్ నిరాధారణకు గురై అందులోని సామాగ్రి చోరీకి గురైంది. ఆలస్యంగా గుర్తించిన ఆర్టీసీ సంస్థ నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ భవనానికి రంగులద్ది వినియోగములకు తెచ్చే ప్రయత్నం చేసింది. మరలా ఆ ప్రయత్నం మరిచింది. ఇటీవల దిశ దినపత్రిక "బస్సులు రాని బస్టాండ్" అనే శీర్షికను ప్రచురించింది.
ఆ కథనాన్ని స్థానిక నవ నిర్మాణ సమితి బాధ్యులు ట్విట్టర్ వేదికగా సమస్యను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీ.సీ సజ్జనర్ కు విన్నవించారు. స్పందించిన ఆయన మహబూబాబాద్ - ఖమ్మం డిపో మేనేజర్ లు సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే భూ అక్రమార్కులు గడచిన ఆరు మాసాల క్రితమే ఆ భూమిని కబ్జాకు మార్గాలు అన్వేషించినట్లు వినికిడి. ఖాళీ జాగా కనబడితే చాలు దర్జాగా కబ్జా చేస్తున్నా ఈ తరుణంలో బైపాస్ ప్రధాన రహదారి పక్కనే కోట్ల రూపాయలు విలువచేసే ఆర్టీసీ భూమి అక్రమార్కుల కబంధహస్తాల్లోకి వెళ్ళకముందే ఆస్తులు పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో.. వేచి చూడాలి మరి.