- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమాషా చేస్తున్నారా..? ఎన్నేళ్లు మీ చుట్టూ తిరుగాలే..? నెక్కొండ తహసీల్దార్‌పై ఓ వ్యక్తి తిట్లదండకం..
దిశ, వరంగల్ బ్యూరో: తన భూమిని మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ మురారిశెట్టి బాలరాజు అనే వ్యక్తి వరంగల్ జిల్లా నెక్కొండ తహసీల్దార్ డీఎస్ వెంకన్నను నిలదీశాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటన బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేర కాకుండా, ఏమాత్రం సమాచారం లేకుండా కొంతమంది వ్యక్తుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసినట్లుగా బాలరాజు ఆరోపిస్తున్నాడు. తన తండ్రి వారసత్వంగా వచ్చిన భూమిని ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడాన్ని బాలరాజు సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేయగా ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు సమాచారం.
అయినా తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆయన పేరు మీదకు భూమిని బదలాయించకపోవడంపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తిట్ల దండకం వినిపించారు. డబ్బులు తీసుకుని మరీ పని చేయడం లేదని రెవెన్యూ కార్యాలయ సిబ్బందిపై మండిపడ్డారు. అయితే దుర్భాష పదజాలం వాడిన బాలరాజుపై తహసీల్దార్ వెంకన్న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తహసీల్దార్‌తో బాలరాజు చేసిన వాగ్వాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.