- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కార్యకర్తలే బీఆర్ఎస్ కు బలం: ఎమ్మెల్యే నరేందర్
దిశ, వరంగల్ టౌన్: బీఆర్ఎస్ కార్యకర్తలే పార్టీకి బలమని, వారే తన బలగమని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ అధ్యక్షతన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో ఎమ్మెల్యే ముందస్తు ఆత్మీయ సన్నాహాక సమావేశం నిర్వహించారు. మొక్కవోని దీక్షతో కార్యకర్తలు పనిచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కార్యకర్తల బాగోగులు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.
పార్టీ బలోపేతానికి డివిజన్ల వారిగా చేపట్టాల్సిన చర్యలు, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఇతర అంశాలపై ఎమ్మెల్యే కూలంకషంగా వారితో చర్చించారు. త్వరలో జరిగే ఆత్మీయ సమావేశాలకు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్, మాజీ కార్పొరేటర్ కోటేశ్వరమ్మ, డివిజన్ నాయకులు బిళ్ళ రవి తదితరులు పాల్గొన్నారు.