- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇనుగుర్తి మండల అభివృద్ధికి చర్యలు.. జిల్లా కలెక్టర్ కె.శశాంక
దిశ, మహబూబాబాద్ టౌన్ : నూతనంగా ఏర్పడిన ఇనుగుర్తి మండలాన్ని అన్నివిధాల అభివృద్ధి పరిచేందుకు ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని జిల్లాకలెక్టర్ శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఇనుగుర్తి మండల అభివృద్ధి కొరకు చేపట్టనున్న పనుల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇనుగుర్తి మండలంకు 108 అంబులెన్స్ కేటాయించారన్నారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు పెంచాలన్నారు. సబ్ సెంటర్ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని, 15 లక్షలతో ప్రతిపాదనలు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో పంపించాలన్నారు.
అలాగే గ్రామపంచాయతీ భవననిర్మాణానికి 20లక్షలతో ప్రతిపాదనలు అందజేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలను 12 లక్షలతో చేపట్టాలన్నారు. జూనియర్ కళాశాల నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. సుదూరప్రాంతాల నుండి వచ్చే 8, 9 తరగతుల విద్యార్థిని విద్యార్థులకు రాబోయే విద్యాసంవత్సరానికి సైకిళ్లు అందజేయాల్సి ఉన్నందున ముందుగానే తెప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలకు, పశు వైద్యసేవలు అందేందుకు అధికారులు కృషిచేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, మహిళా శిశు సంక్షేమ అధికారిణి వరలక్ష్మి, పంచాయతి అధికారి ధన్ సింగ్, విద్యాశాఖ అధికారి రామారావు, తహసీల్దార్ అబిద్ తదితరులు పాల్గొన్నారు.