విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుః కలెక్టర్ సత్యశారద

by Nagam Mallesh |
విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవుః కలెక్టర్ సత్యశారద
X

దిశ,వర్ధన్నపేట : విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని డాక్టర్ల హాజర్ పట్టికను పరిశీలించి 8 మంది డాక్టర్లు గైర్హాజర్ ను గుర్తించారు. అదేవిధంగా గైనకాలజిస్ట్ డ్యూటిలోకి రాకపోవడాన్ని కూడా గుర్తించి ఎందుకు గైహాజరయ్యారో వివరణ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని మెడికల్ విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వం నుండి వచ్చే మందులను, పేషెంట్లకు ఇచ్చే మందులను ఆన్లైన్ లో నమోదు చెయ్యకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆసుపత్రిలో బెడ్స్ కూడా పాతవిగా ఉండడంతో కొత్త బెడ్స్ తెప్పించాలని ఆదేశించారు. దీంతో పాటు ఓపీ విభాగంలో కూడా పేషెంట్లు కూర్చోవడానికి చైర్స్, కొత్త ఫర్నీచర్ తెప్పించాలని ఆదేశించారు. ఆసుపత్రిలోని పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట తహసిల్దార్ విజయ సాగర్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Next Story