గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఏసీబీ రైడ్.. అడ్డంగా దొరికిన ఈవో

by Nagam Mallesh |
గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఏసీబీ రైడ్.. అడ్డంగా దొరికిన ఈవో
X

దిశ, కొత్తగూడ: ఏజెన్సీలోని ముసలమ్మ దేవాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయంలో ఈవోగా పని చేస్తున్న భిక్షమాచారి ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విసిగిపోయిన సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పథకం ప్రకారం రూ.20వేలు ఈవోకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Next Story

Most Viewed