- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్రమ నిర్మాణాలు ఆపండి..డబుల్ఇండ్ల మధ్య పెట్రోల్బాటిల్తో మహిళ నిరసన
దిశ, మరిపెడ (చిన్నగూడూర్ ): మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలోని తను సాగు చేసుకునే భూమిలో అక్రమంగా డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని దళిత మహిళ మద్దెల యాదమ్మ పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేసింది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ధారాసింగ్ , చెన్నయ్య, ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తనకు ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించింది. రూ.10 లక్షలు వెచ్చించి భూమిని బాగు చేసుకున్నానని, పెన్సింగ్, పైపులైన్లు ఏర్పాటు చేసుకోగా వాటిని తొలగించి డబుల్ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని వాపోయింది. ప్రశ్నిస్తే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
బాధిత మహిళ కథనం ప్రకారం. చిన్నగూడూరు గ్రామంలోని 129 సర్వే నెంబర్లలో మొత్తం 36 ఎకరాల 32 గుంటలు ఉండగా, తనకు 6ఎకరాలు 20 గుంటల భూమి ఉందన్నారు. కొంత వేరే వారి వద్ద నుంచి కొనుగోలు చేశామని చెప్పింది. ఈ క్రమంలో స్థానిక బీఆర్ఎస్ లీడర్లు తన భర్త జ్ఞాపకార్థంగా ఎకరం భూమిని పోలీస్ స్టేషన్ కు ఇవ్వాలి అడగగానే సంతకం కూడా చేశానని, అప్పుడే వారి కన్ను మిగితా భూమిపై పడిందన్నారు. తన కుమారుడుతో లోపాయి కారి ఒప్పందం చేసుకొని 129/9,129/10 సర్వే నెంబర్లలో ఎకరం భూమిని ప్రభుత్వానికి అప్పచెబితే, ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ కట్టడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించింది. సర్వేర్ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నామమాత్రపు సర్వే చేశారని ఆరోపించింది. ఇది ప్రభుత్వ భూమి అయితే 40ఏళ్ల నుంచి ఇక్కడ బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా అధికారులు, స్థానిక బీఆర్ఎస్ లీడర్లు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించింది. ఎమ్మెల్యే అండదండలతో లీడర్లు రెచ్చిపోతున్నారని, వారితో ప్రాణహాని ఉందన్నారు. అధికారులే న్యాయం చేయాలని వేడుకుంది. ఈ విషయమై ఎమ్మార్వో రామకృష్ణ వరప్రసాద్ ను వివరణ కోరగా శతాబ్ది ఉత్సవాలు బిజీగా ఉన్నానని పూర్తి సమాచారాన్ని త్వరలో అందజేస్తానని తెలిపారు.