పారిశుధ్య కార్మికుడికి దొరికిన తుపాకీ.. పోలీసులకు అప్పగింత

by Nagam Mallesh |
పారిశుధ్య కార్మికుడికి దొరికిన తుపాకీ.. పోలీసులకు అప్పగింత
X

దిశ, వరంగల్‌ : సిటీలోని ఎంజీఎం కూడలి వద్ద మున్సిపల్ కార్మికుడికి ఓ తుపాకీ దొరికింది. ముందు అదేదే బొమ్మ తుపాకీ అనుకున్నాడు. కానీ తీరా చూస్తే అది ఒరిజినల్ రైఫిల్. దాంతో వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. స్వచ్ఛభారత్ ఆటోడ్రైవర్ కు శుక్రవారం ఉదయం 9ఎంఎం కార్బన్ షార్ట్ తుపాకి దొరకడంతో దాన్ని పోలీసులకు అప్పగించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా యూనివర్సిటీ పరిధిలోనీ సీఆర్పిఎఫ్ 58 బెటాలియన్ ను మణిపూర్ కు డీసీఎం వాహనంలో తరలించే క్రమంలో ఎంజీఎం జంక్షన్ లో రోడ్డుపై తుపాకి జారీ పడిపోయిందని నిర్ధారించారు. ఆ తుపాకీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ది అని గుర్తించి సిఆర్పిఎఫ్ అధికారులకు అప్పగించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. అనంతరం ఆ స్వచ్ఛభారత్ ఆటో డ్రైవర్ ను అభినందించారు.

Advertisement

Next Story