- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Arrested : వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు
దిశ, హనుమకొండ : వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని సోమవారం హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… రహమత్ పుర, ఎల్బీనగర్, వరంగల్ కు చెందిన మహమ్మద్ అనే వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించాలని అత్యాశతో బైకు దొంగతనాలు చేసి అవి గుర్తు తెలియని వ్యక్తులకు తక్కువ ధరకు అమ్మి వచ్చే డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డాడు. సోమవారం అలంకార్ జంక్షన్ వద్ద బైక్ కన్సల్టెన్సీలకు గుర్తు తెలియని వ్యక్తి తక్కువ ధరకు బైక్లు అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. పై నిందితుడు పారిపోతుండగా పట్టుకున్నారు. ఇతనిపై పలు పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి అని గుర్తించారు. ఇతడి నుంచి మూడు హోండా యాక్టివా బండ్లను స్వాధీనం చేసుకుని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని సోమవారం రిమాండ్ చేసి జైలుకు పంపించడం జరిగిందని ఇన్స్పెక్టర్ వై. సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన, ఎస్ఐ కే.సతీష్, క్రైమ్ హెడ్-కానిస్టేబుల్ నారాయణ, కానిస్టేబుల్ మాహేశ్వర్, సంజీవ్, భాస్కర్ లను ఇన్స్పెక్టర్ వై. సతీష్ అభినందించారు.