కాకతీయ పవర్ ప్లాంట్‌లో కరోనా కల్లోలం

by Disha News Web Desk |
కాకతీయ పవర్ ప్లాంట్‌లో కరోనా కల్లోలం
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్పూర్ మండలంలోని కాకతీయ పవర్ ప్లాంట్‌లో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే ఏకంగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాకతీయ పవర్ ప్లాంట్‌లో సుమారు 1500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. శుక్రవారం ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్ తేలింది. రోజురోజుకూ కరోనా విస్తృతంగా వ్యాపిస్తుండటంతో భూపాలపల్లి జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నప్పటికీ, వ్యాపారస్తులు సరైన నియమాలు పాటించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో కరోనా నిబంధనలు కఠినతరం చేయకపోతే కరోనా ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని భయంతో వణికిపోతున్నారు.

Advertisement

Next Story