ఆత్మకూర్‌లో కరోనా విజృంభణ

by Disha News Web Desk |
ఆత్మకూర్‌లో కరోనా విజృంభణ
X

దిశ, ఆత్మకూర్: హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒక్కరోజే 34 కరోనా కేసులు నమోదయ్యాయి. మండలంలోని పెంచికలపేట గ్రామంలో 10 కేసులు, కమారంలో 1, నిరుకుళ్ళలో 1, గుడెపాడ్‌లో 1, మండల కేంద్రంలో 6, పెద్దాపూర్‌లో 12, హన్మకొండలో 3, మొత్తం 34 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి అశ్విన్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు, సానిటైజర్ లేకుండా వెళ్లకూడదని మండల ప్రజలకు సూచించారు. ముఖ్యంగా ఫంక్షన్లలో భౌతిక దూరం పాటించాలన్నారు.

Advertisement

Next Story