ganja seized : 256 కిలోల గంజాయి స్వాధీనం..!

by Kalyani |
ganja seized : 256 కిలోల గంజాయి స్వాధీనం..!
X

దిశ, నర్సంపేట: భారీ స్థాయిలో తరలిస్తున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటుచేసుకుంది. రూ.64 లక్షల విలువ గల 256 కిలోల గంజాయి సహా రెండు కార్లు, మూడు మొబైల్స్ పట్టుబడినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. భూపాలపల్లి జిల్లాకు చెందిన బానోతు బాబు కుమారస్వామి, నస్సురి కుమారస్వామి లు జీవనోపాధి కోసం కారు (డ్రైవింగ్ చేసేవారు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వీరు చెడు మార్గం వైపు వెళ్లారు. ఈ క్రమంలోనే ఏపీలోని డొంకరాయి పరిసర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు రహస్యంగా తరలించి గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే డొంకరాయి లోని ముకుంద్ తో వీరికి పరిచయం ఏర్పడింది. మరో ముగ్గురితో కలిసి 256 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

రెండుకిలోల చొప్పున మొత్తం 128 ప్యాకెట్లలో సిద్ధం చేసి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. డొంకరాయి నుంచి భద్రాచలం, మహబూబాబాద్ మీదుగా నర్సంపేటకి నిందితులు కారులో గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. శనివారం వేకువజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. కమలాపురం గ్రామ క్రాస్ రోడ్ దగ్గర పోలీసులను గుర్తించిన నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు నిందితుల కారును అడ్డగించారు. కారులో గంజాయి ప్యాకెట్లను గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జలెందర్, అంగోతు రాజేందర్, ముకుంద్ అనే వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ముఠా సభ్యులను అరెస్టు, గంజాయిని స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను సీపీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed