కిరాణ దుకాణంలో పదోతరగతి పరీక్ష పత్రాలు..!

by Kalyani |
కిరాణ దుకాణంలో పదోతరగతి పరీక్ష పత్రాలు..!
X

దిశ, గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పదో తరగతి పరీక్ష పత్రాలు (ఆన్సర్ షీట్) కిరాణం దుకాణంలో తూకమయ్యాయి. మంగళవారం పదవ తరగతి పరీక్షలు ముగిశాయి. విద్యార్థులు రాసిన పరీక్ష జవాబు పత్రాలను ఏరోజువి ఆరోజే పోస్ట్ ఆఫీస్ లో తూకం వేసి నిబంధనల ప్రకారం ప్రభుత్వం సూచించిన అడ్రస్ కు పోస్ట్ చేస్తారు. కానీ గార్ల పోస్ట్ ఆఫీస్ లో పెద్ద వేయింగ్ మిషన్ లేకపోవడంతో పదో తరగతి పరీక్ష నిర్వహణ అధికారులు ఆరు బయట ఉన్న కిరాణ దుకాణాలలో తూకం వేసి పోస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ వివాదాస్పదమవుతున్న క్రమంలో ఇలా మరోసారి పదో తరగతి పరీక్ష పత్రాలు కిరాణా దుకాణంలో దర్శనం ఇవ్వడంతో ప్రజలు అవాక్కవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed