Medico Preethi Death:వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత

by GSrikanth |   ( Updated:2023-02-27 05:02:59.0  )
Medico Preethi Death:వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: గత ఐదు రోజులుగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని ప్రీతి కన్నుమూసింది. సీనియర్ల ర్యాగింగ్‌ తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచింది. సీనియర్ స్టూడెంట్ సైఫ్ గత కొన్నెళ్లుగా ప్రీతిని వేధిస్తున్నట్లు, వాట్సాప్ గ్రూపుల్లో అవమానించేలా పోస్టులు పెట్టాడని, అలా మేసేజ్‌లు పెట్టవద్దని వేడుకున్నా వినకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

ప్రీతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వరంగల్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేసినట్లు గుర్తించామని సీపీ రంగనాథ్ తెలిపారు. సైఫ్ వేధించినట్లుగా ఆధారాలు లభించాయని, ఇందులో ఎలాంటి రాజకీయాలు చేయవద్దని స్పష్టం చేశారు. ప్రస్తుతం నిందితుడు సైఫ్‌కు పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించారు.




Advertisement

Next Story

Most Viewed