వరంగల్‌లో మరోసారి కలకలం రేపిన ఎలుకలు

by GSrikanth |
వరంగల్‌లో మరోసారి కలకలం రేపిన ఎలుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఎలుకలు కలకలం రేపాయి. పద్మాక్షి హాస్టల్‌లో విద్యార్థులను కొరికి బీభత్సం సృష్టించాయి. సోమవారం రాత్రి విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో కాళ్లు, చేతులు కొరినట్లు సమాచారం. ఎలుకల దాడిలో ఇద్దరికి గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. పద్మాక్షి హాస్టల్‌లోని డీ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గతంలో వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల ఎలుకలు ముట్టిన ఆహారం తిని కొంత మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. మళ్లీ అదే వరంగల్‌లోని కేయూలో విద్యార్థులనులపై ఎలుకలు దాడి చేయడం ఆసక్తిగా మారింది.

Advertisement

Next Story