HYD: భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో రైతు నిరసన

by GSrikanth |
HYD: భుజాన నాగలి, చేతిలో ఉరితాడుతో రైతు నిరసన
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నుంచి భుజాన నాగలి... చేతిలో ఉరి తాడు పట్టుకొని అర్ధనగ్నంగా డీజీపీ కార్యాలయం వద్దకు వచ్చాడు. వరంగల్ జిల్లా పొనకల్ గ్రామానికి చెందిన దాట్ల సురేందర్‌కు ఊర్లో కొంత భూమి ఉంది. అయితే, స్థానిక బీఆర్ఎస్ నాయకులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూమిని తన తమ్ముడి పేరు మార్పించారని సురేందర్ ఆరోపించాడు. స్థానిక పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరగలేదని చెప్పాడు. ఈ విషయంలో గవర్నర్, హైకోర్టు, డీజీపీ జోక్యం చేసుకొని తనకు న్యాయం చేయాలని కోరాడు. తాను చెప్పింది అబద్ధమైతే హైదరాబాద్ నడిబొడ్డులో ఉరి తీయండంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed