హాట్ హాట్‌గా అసెంబ్లీ సెషన్.. మంత్రి పొన్నం వర్సెస్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం

by Satheesh |   ( Updated:2024-07-24 05:39:20.0  )
హాట్ హాట్‌గా అసెంబ్లీ సెషన్.. మంత్రి పొన్నం వర్సెస్ హరీష్ రావు మధ్య మాటల యుద్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సెషన్ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఆర్టీసీ బకాలపై చర్చ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ జరిగింది. హరీష్ రావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆర్టీసీ కార్మికులను పీఆర్సీ పరిధిలోకి తెస్తామన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఎప్పటిలోగా అపాయింట్ డేట్ ప్రకటిస్తారని..? కార్మికుల యూనియన్ పునరుద్ధరణ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులతో అదనపు గంటలు పని చేయిస్తున్నారన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులను ఎప్పుటి లోగా భర్తీ చేస్తారని హరీష్ రావు క్వశ్చన్ చేశారు. వెంటనే హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే యూనియన్లను రద్దు చేసి పునరుద్ధరణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

గతంలో డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆర్టీసీ సొమ్మును గత బీఆర్ఎస్ ప్రభుత్వమే వాడుకుందుని నిప్పులు చెరిగారు. ఆర్టీసీకి మేం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీలోకి కొత్త బస్సులను కొంటున్నామని, త్వరలోనే 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామని వెల్లడించారు. పని భారం పెరిగిన ఆర్టీసీ కార్మికులు బాగా పని చేస్తున్నారని.. ఇందుకు ఆర్టీసీ కార్మికులను అభినందిస్తున్నామన్నారు. కొనియాడారు. ఎన్నిలకకు ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారని, గత ప్రభుత్వం ఆర్టీసీకి పెట్టిన పెండింగ్ బకాయిలను మేం చెల్లించామని తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేం మా ప్రభుత్వ బాధ్యత అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed