CM రేవంత్ వర్సెస్ కేటీఆర్.. మాటల యుద్ధంతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

by Satheesh |   ( Updated:2024-07-24 08:14:14.0  )
CM రేవంత్ వర్సెస్ కేటీఆర్.. మాటల యుద్ధంతో దద్దరిల్లిన తెలంగాణ అసెంబ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం అసెంబ్లీలో కాక రేపింది. బుధవారం అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. నిధుల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయానికి సంబంధించిన కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే ప్రతి పక్ష నేతగా కేసీఆర్ ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. సభకు వస్తే ప్రధాని మోడీకి కోపం వస్తుందనే కేసీఆర్ రాలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో బీజేపీతో ఒప్పందం చేసుకుని వచ్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటనే రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ఆన్సర్ చెప్పడానికి కేసీఆర్ అవసరం లేదు మేం చాలని.. ముందు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సభలో దేనిపై చర్చ చేయాలనుకుంటుందో ముందు మాకు చెప్పాలని.. సంప్రాదాయాల ప్రకారం నడుచుకోవాలని కేటీఆర్ సూచించారు.

వెంటనే కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో సభను తప్పుదోవ పట్టించి సభను బయటకు వెళ్లిపోవాలని చూస్తున్నారని అన్నారు. తాను తండ్రి పేరును చెప్పుకుని మంత్రిని కాలేదని.. కిందిస్థాయి నుండి ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాయని.. కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా అని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రేవంత్ కామెంట్స్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని మేమూ అనొచ్చని కౌంటర్ ఇచ్చారు. అయ్యల పేర్లు చెప్పి పదవులు అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే ఆయన రాహుల్ గాంధీని అంటున్నడా..? రాజీవ్ గాంధీని అంటున్నడా అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యానని సీఎం అనొచ్చా..? సభా నాయకుడు అలా విమర్శలు చేయవచ్చా అని ప్రశ్నించారు. చివరికి కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను మేం సమర్ధిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed