- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సమస్యల పరిష్కారానికి ‘వాడ వాడకు పువ్వాడ’
దిశ బ్యూరో, ఖమ్మం: వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరంలోని 14వ డివిజన్ నందు శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్‌లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్‌లో వేయాల్సిన రోడ్లు, సైడ్ డ్రైన్ అంశాలపై స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా పనులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభిని ఆయన అదేశించారు.
అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అదేశించారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, కార్పొరేటర్ కూరాకుల వలరాజ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్, డీసీసీబీ చైర్మన్ కే.నాగభూషణం, మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, మునిసిపల్ ఇఇ క్రిష్ణ లాల్, డిఈ ధరణి, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ ఏడిఈ రమేష్, తహసిల్దార్ శైలజ, నాయకులు పగడాల నాగరాజ్, దెవభక్తుని కిషోర్ బాబు, అంజిరెడ్డి, కన్నం ప్రసన్న కృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.