- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయాలి.. విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్
by Javid Pasha |
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్టంలో విద్య వ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్య సంచాలకులు దేవసేనకి వినతి పత్రం సమర్పించారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావొస్తున్నా నేటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయలేదని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. అనుమతులు లేని ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలు నారాయణ, చైతన్య పాఠశాలలను రద్దు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పటిష్టంగా అమలు చేయాలని కోరారు.
Advertisement
Next Story