- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు సంజయ్‌ని శిక్షిస్తారు కానీ.. సైఫ్‌ను రక్షిస్తారు..!!
దిశ, డైనమిక్ బ్యూరో : ‘సైఫ్ అయినా సంజయ్ అయినా ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తాం’అని మెడికో ప్రీతి ఘటనపై స్పందిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. ‘నిజమే.. మీరు సంజయ్‌ను శిక్షిస్తారు.. కానీ, సైఫ్‌ను రక్షిస్తారు..!’ అంటూ విమర్శలు గుప్పించింది. 5 రోజులపాటు నిమ్స్‌లో ప్రీతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కేటీఆర్ కనీసం ట్వీట్ చేయలేదు అని మండిపడింది. అంతేకాకుండా, ఈ ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ఘటనను రాజకీయంగా వాడుకునేది తెలంగాణ ప్రభుత్వమే అని ఆరోపించింది.
దోషులను కాపాడి ఓటు బ్యాంకును పదిలపరుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని.. బిల్కీస్ బానో ఘటనపై సీఎం, స్మితాసబర్వాల్ పెద్దఎత్తున విమర్శించిన వారు.. స్వరాష్ట్రంలో దళితులు, గిరిజనులు హత్యలకు, వేధింపులకు గురై చస్తున్నా స్పందించడానికి మనసు రావడం లేదని ప్రశ్నించింది. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం అని పేర్కొంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న వివక్షను ప్రతిహిందువు పసిగట్టాలని సూచించింది. కళాశాలల్లో ర్యాగింగ్ పేరుతో లవ్‌జిహాద్ కొనసాగుతోందని ఆరోపించింది. ఈ ఘటనలను మనమే ప్రతిఘటించాలని.. మన సత్తాను మనమే చాటాలని విశ్వహిందూ పరిషత్ వ్యాఖ్యానించింది.