Viral Video: "మరో వార్నర్".. హిందీ పాటకు స్టెప్పులేసిన అమెరికా రాయబారి ఎరిక్

by Ramesh Goud |   ( Updated:2024-10-30 12:45:52.0  )
Viral Video: మరో వార్నర్.. హిందీ పాటకు స్టెప్పులేసిన అమెరికా రాయబారి ఎరిక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం(India)లోని అమెరికా రాయబారి(American Ambassador) సాంప్రదాయ దుస్తులతో హిందీ పాట(Hindi Song)కు స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో(Video) నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ(Delhi)లోని ఎంబసీ కార్యాలయం(Embassy Office) వద్ద దీపావళి వేడుకలు(Diwali Celebrations) ఘనంగా జరిగాయి. ఇందులో అమెరికాకు చెందిన రాయబారి ఎరిక్ గార్సెట్టి(Eric Garcetti) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సాంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. అంతేగాక స్థానికులతో కలిసి తౌబా.. తౌబా.. అనే హిందీ పాటకు సినిమా స్టైల్లో స్టెప్పులు వేశారు. అమెరికా రాయబారి చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్(Viral) గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎరిక్ డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. దీనిపై భారతదేశంలో పుట్టిన వాళ్లు సాంప్రదాయాలు మరిచిపోతుంటే.. విదేశీయులు భారత సాంప్రదాయాలు పాటిస్తూ.. ఇక్కడి వాళ్లను మెప్పిస్తున్నారని అంటున్నారు. అంతేగాక ఎరిక్ "మరో వార్నర్" అవుతాడేమో అని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story