- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
35 ఏళ్ల తర్వాత ఒకేరోజున నిమజ్జనం.. మిలాద్-ఉల్-నబీ ఊరేగింపు.. హైదరాబాద్ పోలీసులకు సవాల్..!
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు లక్షలాది మంది భక్తుల పూజలు అందుకోనున్న బొజ్జ గణపయ్య నిమజ్జన శోభాయాత్ర ఈనెల 28న జరుగనుంది. ప్రస్తుతం ఇదే హైదరాబాద్‌సిటీ పోలీసుల్లో టెన్షన్సృష్టిస్తోంది. కారణం అదే రోజున మిలాద్ఉల్నబీ ఊరేగింపు జరగనుండటం.
ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు శోభాయాత్ర.. మిలాద్ఉల్నబీ ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. ఈ క్రమంలోనే సున్నితమైనవిగా గుర్తించిన పోలీస్స్టేషన్లకు తాత్కాలిక పద్దతిపై అదనంగా ఇన్స్పెక్టర్లను పంపిస్తూ హైదరాబాద్సీపీ సీ.వీ.ఆనంద్ఉత్తర్వులు జారీ చేశారు.
లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన..
ఈసారి హైదరాబాద్కమిషనరేట్పరిధిలో లక్షకు పైగా విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతుందన్నది పోలీసుల అంచనా. వీటిలో కొన్ని విగ్రహాల నిమజ్జనం చవితి వేడుకలు ప్రారంభమైన మూడు, అయిదు, తొమ్మిదో రోజున జరుగుతాయి. మిగిలిన విగ్రహాల నిమజ్జనం శోభాయాత్ర రోజున జరుగుతుంది. ఈ శోభాయాత్రలో నగరం నలుమూలల నుంచి పది లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారు.
35 ఏళ్ల తరువాత..
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సంవత్సరం శోభాయాత్ర రోజునే మిలాద్ఉల్నబీ ఊరేగింపు రావటం పోలీసుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ఇలా రెండు ఊరేగింపులు ఒకే రోజున రావటం 35 సంవత్సరాల తర్వాత అని చెప్పిన ఓ సీనియర్పోలీసు అధికారి.. ఈసారి బందోబస్తు మాకు కత్తి మీద సామే అని వ్యాఖ్యానించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా అది పెద్దదయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ క్రమంలోనే శాంతిభద్రతల పరిరక్షణకు ఈ సంవత్సరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఇందులో భాగంగానే ఇటీవల ఇరు వర్గాలకు చెందిన పెద్దలతో పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్సమావేశాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో మిలాద్ఉల్నబీ ఊరేగింపును మరో రోజుకు వాయిదా వేయటానికి ముస్లిం పెద్దలు అంగీకారాన్ని తెలిపినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిని కొందరు అంగీకరించటం లేదన్నారు. ఈ క్రమంలో రెండు ఊరేగింపులు ఒకే రోజు జరుగుతాయని భావిస్తూ బందోబస్తు స్కీములు తయారు చేస్తున్నట్టు వివరించారు.
అదనంగా సీఐలు..
శోభాయాత్ర రోజున సిటీ పోలీసులకు తోడుగా పదిహేను వేలమందికి పైగా అదనపు బలగాలు రానున్నట్టు ఆ అధికారి చెప్పారు. చవితి వేడుకలు జరిగే అన్ని రోజులు ప్రతీ మండపం వద్ద పోలీస్పికెట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దాంతోపాటు రౌడీషీటర్లు, ఇతర అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా పెట్టినట్టు చెప్పారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నట్టు వివరించారు.
ఈ క్రమంలోనే సీ కేటగిరీలో ఉన్న ఇరవై రెండు పోలీస్స్టేషన్లకు అదనంగా ఇన్స్పెక్టర్లు అవసరం అన్న అంశం తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. అందుకే హైదరాబాద్‌సిటీ పోలీస్‌లోని వేర్వేరు విభాగాల్లో పని చేస్తున్న 22మంది ఇన్స్పెక్టర్లను ఈ పోలీస్స్టేషన్లకు అదనంగా పంపిస్తూ పోలీస్కమిషనర్ఆనంద్ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలిపారు.
- Tags
- Ganesh Chaturthi