- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లె కన్నీరు పెట్టింది.. ఒకే కుటుంబంలో గంటల వ్యవధిలో నలుగురు మృతి
దిశ, పాపన్నపేట : పాపన్నపేట మండల పరిధిలోని ఎల్లాపూర్ గ్రామం దుఃఖ సాగరంలో మునిగింది. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం ఏలాంటి చింత లేకుండా సాఫీగా బతుకుతుంది. శుక్ర వారం రోజు ఒక వివాహానికి కుటుంబ సభ్యులంతా నవ్వుతూ బయలుదేరారు. ఆ నవ్వులు ఇంకెంతో కాలం ఉండలేవని ఆ కుటుంబం గుర్తించలేకపోయింది. పాపం ఆ కుటుంబాన్ని విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో రోజుకొకరిని మింగేసింది. దీంతో ఎల్లాపూర్ గ్రామం మొత్తం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. రోజుకు ఒకరి మృతి వార్త, రోజుకొకరి అంత్యక్రియలతో ఎల్లాపూర్ లో ఏ ఇంటిని పలకరించిన కన్నీటిపర్యంతమే అవుతున్నారు. వివరాలలోకి వెళ్తే ఎల్లాపూర్ గ్రామంలో దుర్గ గౌడ్, నాగరాజు గౌడ్‌లు అన్నదమ్ములు.
ఎల్లాపూర్ కేలో ఆదర్శంగా వారు జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రోజు పెళ్లికని కుటుంబ సభ్యులు కారులో దౌల్తాబాద్‌కు బయలుదేరారు. ముగించుకొని తిరుగు ప్రయాణంలో సొంత గ్రామమైన ఎల్లాపూర్‌కు వస్తుండగా, కొల్చారం శివారులో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో నాగరాజు గౌడ్ అతడి అన్న కూతురు హర్షిత సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దుర్గ గౌడ్ అతడు భార్య తీవ్ర గాయాలై హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే శనివారం నాగరాజు గౌడ్‌తో పాటు హర్షిత అంత్యక్రియలు పూర్తయ్యాయో లేవో, దుర్గ గౌడ్ మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. దీంతో గ్రామస్తులు తల్లిడిల్లిపోయారు. అతడి శవం కూడా ఇంకా ఇంటికి చేరనే లేదు, ఆదివారం ఉదయం అతడి భార్య లావణ్య మృతి వార్త పిడుగుల పడింది. దీంతో గ్రామమంతా బాధిత కుటుంబం ఇంటి వద్దకు చేరి బరువెక్కిన హృదయాలతో చలించిపోతున్నారు. అందరూ చనిపోవడంతో మిగిలిన ఇరువురు చిన్నారులను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.